Tuesday 22 September 2020

ఆస్కార్ బరిలో గ్లోబల్ స్టార్ ప్రియాంక | Manacinema | priyanka chopra oscar nomination |Latest movie news | Manacinema | Movie news | Tollywood news | Latest telugu news |Movie gossips | Box office collections

 priyanka chopra oscar nomination | ఝార్ఖండ్ నుండి (అప్పట్లో బీహార్) ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గ్లోబల్ స్టార్ రేంజ్ కి చేరుకుంది ప్రియాంక చోప్రా. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవటంతో ప్రియాంక గ్లామర్ కెరీర్ మొదలైంది. 2002 లో హమ్ రాజ్ సినిమాతో ప్రియాంక బాలీవుడ్ లో అడుగు పెట్టాల్సింది. అయితే కమిట్మెంట్ల ప్రోబ్లేంటో ఆ సినిమానుంచి ప్రియాంకను తప్పించారు. ఆ తరువాత విజయ్ తో తమిళ్ లో చేసిన ‘తమిళం’ అఫీషియల్ గ ప్రియాంక డెబ్యూ మూవీ. బాలీవుడ్ లో సన్నీ డియోల్, ప్రీతి జింతా ముఖ్యపాత్రలలో తెరకెక్కిన ‘ది హీరో .. లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై’ సినిమాలో రెండో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.




Link :-  https://www.manacinema.com/telugu/movie-news/2020/09/22/priyanka-chopra-oscar-nomination/


అప్పటినుంచి ఇంకా ఒక టాప్ హీరోయిన్ గానే కొనసాగుతోంది ప్రియాంక. హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించినా, ఏబీసీ స్టూడియోస్ తో అగ్రిమెంట్ తరువాత ప్రియాంక కెరీర్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. ఆ సంస్థలో తెరకెక్కిన థ్రిల్లర్ సిరీస్ క్వాంటికో తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని కొంత హిందీ సినిమాకు దూరమైంది. తాజాగా ఆమె నటించిన మాట్రిక్స్, వైట్ టైగర్ టు సిటాడెల్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో వైట్ టైగర్ సినిమా కు గాను ‘బెస్ట్ సపోర్టింగ్ రోల్’ కేటగిరిలో ఆస్కార్ కు నామినేట్ అయినట్టు వార్తలు అందుతున్నాయి.

No comments:

Post a Comment

NTR30 to roll very soon | Trivikram will direct NTR’s next film | Latest movie news | Manacinema | Movie news | Tollywood news | Latest telugu news

NTR30 to roll very soon | Young Tiger NTR is completely occupied with the shoot of RRR that is delayed by a year. SS Rajamouli is the direct...